Home > సినిమా > క్లీంకారకు అల్లు అర్జున్ విలువైన బహుమతి

క్లీంకారకు అల్లు అర్జున్ విలువైన బహుమతి

క్లీంకారకు అల్లు అర్జున్ విలువైన బహుమతి
X

గోల్డెన్ స్పూన్ అంటే నిజంగా రామ్ చరణ్, ఉపాసనల కూతురు క్లీంకారదే. ఈమె పుట్టక ముందు నుంచీ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది. పుట్టినప్పటి నుంచీ ప్రతీ విషయం లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకూ అందరూ కవర్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లీంకారకు సంబంధించి ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

క్లీంకారకు బోలెడు బహుమానాలు వస్తున్నాయి. మొన్ననే రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీయార్ బంగారు డాలర్లతో మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు. అల్లు అర్జున్‌ దంపతులు పాపకు అరుదైన స్పెషల్‌ బహుమానంను ఇచ్చారట. ఆ గిఫ్ట్ కి ఉపాసన, రామ్‌ చరణ్‌ కూడా సర్‌ ప్రైజ్‌ అయ్యారని టాక్. క్లీంకార కు అల్లు అర్జున్‌ దంపతులు నేమ్‌ ప్లేట్ ను బహుమానంగా ఇచ్చారు. ఆ నేమ్ ప్లేట్‌ లో క్లీంకార పేరు ఉంది. ఆ అక్షరాలను బంగారంతో చేయించడంతో పాటు చుట్టూ డైమండ్స్ పొదిగి ఉండేలా డిజైన్ చేయించారుట. అందుకే ఆ గిఫ్ట్ రామ్ చరణ్, ఉపాసనలకు తెగ నచ్చేసిందని చెబుతున్నారు.

ఏది ఏమైనా క్లీంకార లక్కీ గర్ల్. మామూలుగానే మెగా కౌంపౌండ్ లో పిల్లలకు స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఈ పాపకు తండ్రీ, తల్లీ, తాత, మామవయ్యలు అందరూ సెలబ్రిటీలే కావడంతో మరికొంచెం ఎక్కువ అటెన్షన్ లభిస్తోంది. అలాగే విలువైన బహుమతులు కూడా అందుకుంటోంది.పెద్దయితే ఇంకెన్ని వస్తాయో చూడాలి మరి.

allu arjun presenetd a valuble gift to ram caran daughter kleenkara. movies, tollywood, mega family, ram caharan, upasana, daughter, kleenkara, allu arjun, gift, name plate

Updated : 2 Aug 2023 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top