Home > సినిమా > పుష్ప2 రిలీజ్ డేట్ ఇదేనా..?పది రోజులు జాతరే

పుష్ప2 రిలీజ్ డేట్ ఇదేనా..?పది రోజులు జాతరే

పుష్ప2 రిలీజ్ డేట్ ఇదేనా..?పది రోజులు జాతరే
X

పుష్ప సినిమాలో తన పవర్‏ఫుల్ పెర్ఫార్మెన్స్‏తో ఓ రేంజ్‏లో దుమ్ముదులిపిన బన్నీ తాజాగా బెస్ట్ యాక్టర్‎గా జాతీయ అవార్డును సొంతం చేసుకుని చ‌రిత్ర‌ను సృష్టించాడు. ఇదే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్ష‌న్ విభాగంలోనూ జాతీయ అవార్డు వచ్చింది. ఈ రెండు నేష‌న‌ల్ అవార్డులతో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది. సినిమా ఎప్పుడు విడుదలైనా బంపర్ హిట్ ఖాయమని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి వెయ్యి కోట్లు పక్కా అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను వేరే లెవెల్‎లో తీసుకువచ్చేందుకు డైరెక్టర్ సుకుమాత్ తెగ కుస్తీలు పడుతున్నాడు. అయితే పుష్ప సినిమా విడుదలై ఏడాది పూర్తైనా ఇంకా పుష్ప 2 రిలీజ్ డేట్‏పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా లేటెస్ట్ అప్డేట్‌ ప్రకారం పుష్ప2 కు మూహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్‌ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.





వచ్చే ఏడాది మార్చి 22న పుష్ప సీక్వెల్‎ విడుదల చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. సీక్వెల్ పార్ట్ ను మార్చి 22న విడుదల చేస్తే మొదటి వారం తర్వాత 25న హోళీ ఉంది, ఆ తరువాత 29 గుడ్ ఫ్రైడే ఉంది దీంతో లాంగెస్ట్ వీకెండ్ మస్తీకి ప్లాన్ చేశారు మేకర్స్. సినిమాకు ఏమాత్రం కాస్త పాజిటివ్ టాక్ వినిపించినా రెండు వారాలు బాక్సాఫీస్‎ను బద్దలు కొట్టడం ఖాయం. పుష్ప 2 బ్లాక్‌ బస్టర్‌ అయితే గనుక మూడో వారం తర్వాత ఉగాది రానుంది. ఈ పండుగను క్యాష్ చేసుకుంటే పుష్ప2 బీభత్సం సృష్టించడం ఖాయం.







Updated : 26 Aug 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top