Home > సినిమా > ప్రభాస్ బాటలోనే అల్లు అర్జున్ కూడా!

ప్రభాస్ బాటలోనే అల్లు అర్జున్ కూడా!

ప్రభాస్ బాటలోనే అల్లు అర్జున్ కూడా!
X

ప్రభాస్ ఆదిపురుష్ దెబ్బ టాలీవుడ్ మీద గట్టిగానే పడినట్టు ఉంది. ప్రభాస్ మొట్టమొదట చేసిన బాలీవుడ్ మూవీ ఆది పురుష్. ఇది హిట్ అవలేదు సరికదా...బోలెడన్ని కాంట్రవర్శీలను తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు ప్రభాస్ ఇక బాలీవుడ్ డైరెక్టర్లతో చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. సిద్ధార్ధ్ ఆనంద్ ప్రాజెక్ట్ ను కూడా కాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాట పడుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బన్నీ పుష్ప-2తో బాగా బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో, సందీప్ వంగతో సినిమాలు చేయనున్నాడు. వీటితో పాటూ ఓ బాలీవుడ్ సినిమా కూడా చేస్తాడని ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయి. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్, అల్లు అర్జున్ ను తన సినిమా చేయమని అడిగితే ఐకాన్ స్టార్ నో చెప్పాడుట. ఆదిత్య, అమర్ అశ్వత్థామ అనే భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోగా మొదట విక్కీ కౌశల్ అనుకున్నారు. తరువాత రణవీర్ సింగ్ అని వార్తలు వచ్చాయి. చివరకు మన అల్లు అర్జున్ దగ్గరకు కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ఆది పురుష్ ఫెల్యూర్ చేశాక బన్నీ ఈ సినిమా చేయడానికి జంకుతున్నాడుట. దానికి తోడు అమర్ అశ్వత్థామ కూడా గ్రాఫిక్స్ సినిమాగానే తీయాలని చూస్తున్నాడుట డైరెక్టర్. ఇది బన్ని బాబును ఇంకా భయపెట్టిందని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.

అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన వార్త ఫిల్మ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ మన స్టార్ హీరోలను మాత్రం ఆదిపురుష్ బాగా భయపెట్టిందనే చెప్పాలి. దీంతో వాళ్ళు బాలీవుడ్ మేకర్స్ విషయంలో విపరీతంగా జాగ్రత్తపడుతున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు.


Updated : 8 Aug 2023 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top