ఇతన్నేనా వీడేం హీరో అన్నారు...ఇప్పుడు చెప్పండి ఏమంటారో.
X
వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి. తండ్రి మెగా ప్రొడ్యూసర్. బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. దాంతో అస్సలు బాలేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. మొదటి సినిమా పెద్ద డైరెక్టర్ తో కాబట్టి హిట్ అయిపోయింది. కానీ అతన్ని చూసి ఇతడేం హీరో...ఖర్మరా నాయనా అనుకున్నారు. ఈ హీరోకి ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ డాన్స్ అద్భుతంగా చేయగలగడం.మరీ ఇలా ఉన్నాడేంట్రా అని కామెంట్లు చేశారు. కానీ అతనవేమీ పట్టించుకోలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ...తనను తాను మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమా సినిమాకి యాక్టింగ్ తో పాటూ తన లుక్స్ ని కూడా ఛేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు బాబోయ్ అన్నవాళ్ళే ఇప్పుడు అరె ఏమున్నాడు రా అంటున్నారు. ఐకాన్ స్టార్ అంటూ బిరుదులు ఇస్తున్నారు.
ఇప్పటికే అందరికీ అర్ధం అయిపోయింది ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. అదేనండీ...ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. పాన్ ఇండియా లెవల్ హీరోగా ఎదిగిన అతణ్ణి చూస్తే ఎవరైనా వావ్ సూపర్ అనాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ పెద్దదే అయినా దాని మీద ఆధారపడకుండా కష్టపడ్డాడు. తానేంటో నిరూపించుకున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా తనను తాను స్టైలిష్ గా మార్చుకున్న తీరు మాత్రం అద్భుతం. ట్రెండ్ క్రియేట్ చేయడంలో అల్లు అర్జున్ తర్వాతనే ఎవరైనా. యూత్ ఫ్యాషన్ కు ఐకాన్ బన్నీ. స్టైల్ కు కేరాఫ్ అడ్రస్. అందుకే స్టైలిష్ స్టార్ అనిపిలుచుకుంటారు అతణ్ని ముద్దుగా.
బట్టలు, హెయిర్ స్టైల్ ఇవన్నీ తరచుగా మారుస్తుంటాడు బన్నీ. సినిమా సినిమాకు మారుస్తుంటాడు. అలా తన స్టైలిష్ లుక్స్‌తో ఇటు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా మరోసారి తనలోని స్టైలిష్ నెస్ ను చూపించాడు బన్నీ. ది ట్రావెల్ అండ్ లీజర్ బ్రాండ్ కవర్ ఫోటో షూట్ లో అదరగొట్టాడు. మైండ్ బ్లోయింగ్ చేసేసాడు. లాంగ్ హెయిర్, గడ్డం, కలర్ ఫుల్ అవుట్ ఫిట్ తో రాక్ చేసి పారేశాడు. అల్లు అర్జున్ వేసిన అవుట్ ఫిట్స్ కానీ...గాడ్జెట్స్ కానీ కిరాక్ అనిపించాయి. కూల్ అండ్ స్టైలిష్ లుక్ తో టాప్ టూ బాటమ్ చితక్కొట్టేశాడు. బన్నీ లుక్స్ కు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్ అండ్ అమ్మాయిలు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మొదటి సినిమాలానే ఇది కూడా బంపర్ హిట్ లవ్వాలని చాలా కష్టపడుతున్నారు బన్నీ అండ్ డైరెక్టర్ సుకుమార్.