Home > సినిమా > National Award : Allu Arjun : నేషనల్ అవార్డ్లో టాలీవుడ్ సత్తా.. ఎవరికి ఏ అవార్డ్ వచ్చిందంటే?

National Award : Allu Arjun : నేషనల్ అవార్డ్లో టాలీవుడ్ సత్తా.. ఎవరికి ఏ అవార్డ్ వచ్చిందంటే?

National Award : Allu Arjun  :  నేషనల్ అవార్డ్లో టాలీవుడ్ సత్తా.. ఎవరికి ఏ అవార్డ్ వచ్చిందంటే?
X

ఢిల్లీలో 69వ నేషనల్ అవార్డ్స్ ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. సినీ నటులు అవార్డులు అందుకుంటున్నారు. 70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాస్తూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్‌. ‘పుష్ప.. ది రైజ్’ సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఐకాన్ స్టార్ ను వరించింది. రాష్ట్రపతి ముర్ము ఈ అవార్డు అందజేశారు. ఈ వేడుకకు అల్లు అర్జున్.. తన భార్య అల్లు స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యాడు. కాగా తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటిగా ఆలియా భట్(గంగూబాయ్ కతియావాడి), కృతి సనన్ (మిమి)లకు నేషనల్ అవార్డు వచ్చింది.

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరిలో దేవి శ్రీ ప్రసాద్ కు అవార్డు లభించింది. పుష్ప సినిమా మ్యూజిక్ కు ఈ అవార్డు వరించింది. దీంతోపాటు ఉత్తమ గేయ రచయిత కేటగిరిలో.. చంద్రబోస్ అవార్డ్ అందుకున్నారు. కొండపొలం సినిమాలోని ‘ధం ధం ధం’ పాటకు ఈ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ ప్రముఖుల జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమా టీం కూడా చేరింది. ఆర్ఆర్ఆర్ టీం నేషనల్ అవార్డ్స్ అందుకుంది. ఆ సినిమాకు 6 విభాగాల్లో అవార్డులు వచ్చాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో రాజమౌళి పురస్కారం అందుకోగా.. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా కాలభైరవ (కొమురం భీముడో పాట), ఉత్తమ నేపథ్య సంగీతానికి కీరవాణి, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు వచ్చాయి. వీరితో పాటు బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు అవార్డు అందుకున్నాడు.

https://x.com/AlluSnehaReddy_/status/1714252539011670210?s=20




Updated : 17 Oct 2023 12:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top