అల్లుఅర్జున్ చేతికి గాయం.. బన్నీ ఫ్యాన్స్ ఆందోళన..!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు గాయం అయ్యింది. ప్రస్తుతం ఆయన పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో కట్టు కట్టుకుని ఉండటం చూసి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేందుకు బిజీ షెడ్యూల్‌ను పెట్టారు. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. జాతరకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ఈ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. సీక్వెన్స్‌లో అల్లుఅర్జున్ అమ్మవారి గెటప్‌లో కనిపించనున్నారు. ఆ అవతారానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట ఇప్పటికే వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం పుష్ప2 సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అల్లు అర్జున్ ఎడమ చేతికి చిన్న గాయం అయ్యిందంట. అది పెద్ద దెబ్బ అయితే కాదని, రెండు రోజుల్లో నయం అయిపోతుందని వైద్యులు చెప్పారట. పుష్ప2 లీక్డ్ పిక్‌లో బన్నీ గాయాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కంగారుపడిపోతున్నారు. అయితే గాయం అయ్యాక బన్నీ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లోకి వచ్చారట. ప్రస్తుతం ఆయన గాయం మానిపోయిందట. ఈ విషయం తెలిసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.