Home > సినిమా > Rajdhani Files : ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు తొలగిన అడ్డంకులు

Rajdhani Files : ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు తొలగిన అడ్డంకులు

Rajdhani Files :  ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు తొలగిన అడ్డంకులు
X

అమరావతి రైతుల ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్‌’ చిత్ర విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్‌ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సినిమా సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు ఓకే చెప్పింది

ఎన్నికల వేళ వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను తీశారని ఆ పార్టీ తరఫు లాయర్ వాదించారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా 'రాజధాని ఫైల్స్‌' చిత్ర ప్రదర్శనకు సెన్సార్ అధికారులు సర్టిఫికేట్ జారీ చేశారని విన్నవించారు. అయితే నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఈ వాదనలను ఖండించారు. రివిజన్ కమిటీ సూచనల మేరకు ఆయా సన్నివేశాలను తొలగించామని.. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పారు. గతేడాది డిసెంబర్ లో సెన్సార్ సర్టిఫికెట్ వస్తే.. వైసీపీ నేతలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

రాజధాని ఫైల్స్ సినిమా గురువారం రిలీజ్ కాగా.. ఈ చిత్రాన్ని ఉమ్మడి కృష్ణాలో 26 థియేటర్లతో పాటు కొన్ని మల్లీప్లెక్స్‌ల్లోనూ విడుదల చేశారు. ఉదయం ఆట మొదలయ్యే సరికి రెవెన్యూ అధికారులు థియేటర్లకు వచ్చి.. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చిత్ర ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.. రెవెన్యూ అధికారులు వెళ్లే సరికి కొన్ని థియేటర్లలో షో మొదలైంది. ఆయా థియేటర్లలో మాత్రం మేనేజర్లు కోర్టు తీర్పు కాపీని ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఆ ఉత్తర్వులను టికెట్‌ కౌంటర్ల వద్ద అతికించారు. మ్యాట్నీ నుంచి పూర్తిగా నిలుపుదల చేయాలని ఆదేశించారు.



Updated : 16 Feb 2024 12:00 PM IST
Tags:    
Next Story
Share it
Top