Ambajipet Marriage Band : బ్యాండ్ గట్టిగానే మోగింది.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
X
(Ambajipet Marriage Band) కలర్ ఫొటో, రైటర్ పద్మభూషన్ లాంటి సినిమాలతో హిట్ కొట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దుశ్యంత్ కటికినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ ను అలరించింది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఈ రెండు రోజుల్లో రూ.2.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృదం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అంచనాలను మించి ఓపెనింగ్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించి రూ. 3 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఫిబ్రవరి 9 వరకు కొత్త సినిమాలేవీ లేకపోవడంతో.. మరిన్ని కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.