Home > సినిమా > అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్
X

కథల్లేవు అంటారు కానీ.. తరచి చూస్తే ప్రతి మనిషికీ ఓ కథ ఉంటుంది. ప్రతి సమూహానికీ ఒక వ్యథ ఉంటుంది. ఆ వ్యథలను కథలుగా మార్చి కాసింత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఓ మంచి కలర్ ఫుల్ సినిమా తయారవుతుంది. ఇలాంటి కథలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. కానీ మనోళ్లకు ఈ స్టోరీస్ పై శ్రద్ధ ఉండదు. ఎంత సేపూ హీరోల బిల్డప్పులు, ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ అంటూ ఇంకా అక్కడే వేళ్లాడుతున్నారు. బట్ అప్పుడప్పుడూ వచ్చే ఇలాంటి కథలు హృదయాలను కదిలిస్తాయి. గతంలో కలర్ ఫోటో అనే సినిమాతో అలానే కదిలించిన సుహాస్ ఈ సారి అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమాతో వస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే మరో హార్ట్ మెల్టింగ్ మూవీ అనిపించక మానదు..

షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు వచ్చి చిన్న పాత్రలతో మొదలై హీరోగా మారాడు సుహాస్. నటన తెలిసిన వాడుగా చాలా తక్కువ టైమ్ లోనే ఆడియన్స్ కు నచ్చేశాడు. కలర్ ఫోటోతో హీరోగా మారినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చాయి. కానీ బలమైన కథ, అంతకు మించిన నటనతో మెప్పించాడు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. హిట్2లో విలన్ గానూ మెప్పించాడు. ఇప్పుడు మరోసారి ఓ బలమైన కథ, కథనం గ్యారెంటీ అనేలా అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమాతో వస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ వెంకటేష్ మహా ప్రెజెంట్ చేయగా.. ధీరజ్ మొగిలినేని నిర్మించాడు. ఫిబ్రవరి 2న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అంబాజీపేట అనే ఊరిలోని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కథగా మొదలై.. జాతికి నీతికి ముడిపెడుతూ.. సాగిన ఈ ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడిన మంగలి కుర్రాడు.. ఊరిలో పెళ్లిళ్లకు బ్యాండ్ కూడా వాయిస్తూ ఉంటాడు. అతనితో ప్రేమలో పడిన అమ్మాయి పేరెంట్స్ కు ఇతని జాతి అడ్డు వస్తుంది. అదే టైమ్ లో ఇతని జాతిలోని అమ్మాయితో పక్కను పంచుకోవాలనే నీచబుద్ధినీ చూపిస్తుంటారు. అక్కడ అడ్డం రాని కులం, వీరి ప్రేమకు అడ్డు వస్తుంది. సహజంగానే పోలీస్ లు కూడా ఆ పెద్దోళ్లకే సపోర్ట్ గా నిలుస్తారు. దీంతో అందరి ముందూ అవమానిస్తూ ఈ కుర్రాడికి ఊరందరి మధ్యలో గుండు కొట్టిస్తారు. మరి ఈ అవమానానికి వీళ్లు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేదే సినిమా అని అర్థం అవుతున్నా.. ప్రేక్షకులను మరో స్థాయిలో మెప్పించగలిగే కంటెంట్ ఏదో ఈ కథలో ఉందేమో అనిపిస్తోంది. కాకపోతే కలర్ ఫోటోలాగా ఇది కూడా శాడ్ ఎండింగ్ స్టోరీ అనిపించేలా ట్రైలర్ లోని చివరి షాట్ ఉంది. దీంతో కలర్ ఫోటోతో సహజంగానే పోలికలు వస్తాయి. ఆ పోలికలకు తావులేని కథనంతో ఈ సినిమా మెప్పిస్తేనే కమర్షియల్ గా సక్సెస్ వస్తుంది.ఇక హీరోగా సుహాస్, హీరోయిన్ గా శివానీ చాలా సహజంగా కనిపిస్తూ నటించారు. పాటలు కూడా బావున్నాయి. మొత్తంగా మన చుట్టూ జరిగిన కథల్లోని ఓ కథలా కనిపిస్తోన్న ఈ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సౌండు బాక్సాఫీస్ వద్ద కూడా స్ట్రాంగ్ గానే వినిపించేలా ఉందనిపిస్తోంది.

Updated : 24 Jan 2024 9:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top