Home > సినిమా > ఆలియా భట్ తో అంబానీ బిజినెస్ డీల్

ఆలియా భట్ తో అంబానీ బిజినెస్ డీల్

ఆలియా భట్ తో అంబానీ బిజినెస్ డీల్
X

టాలీవుడ్ సీత...ఆలియా భట్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. దాదాపుగా ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ లే. అంతేకాదు ఇప్పుడు ఆమె ఎంట్రప్రెన్యూర్ గా కూడా రాణిస్తోంది. తను మొదలెట్టిన చిల్డ్రన్ వేర్ ఎడ్ ఎ మమ్మా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆ కంపెనీని ఏకంగా రిలయన్స్ అధినేత అంబానీ కూతురు ఇషా కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. దాని కోసం ఆలియాతో 350 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్.

ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా మంచి వ్యాపారవేత్త. తండ్రి వ్యాపారాల్లో కొన్నింటిని హ్యాండోవర్ చేసుకుని వాటిని మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు అందులో భాగంగానే ఆలియా భట్ కంపెనీ ఎడ్ ఏ మమ్మా ను కూడా కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో భాగమైన రిలయన్స్ బ్రాండ్ ద్వారా ఆలియా కంపెనీని కొంటున్నారు. ప్రస్తుతం ఆలియా కంపెనీ ఆస్తుల విలువ 150 కోట్లు ఉంటే దానికి రెట్టింపు ధర ఇచ్చి అంటే...300 నుంచి 350 కోట్ల వరకు ఇవ్వాలని అనుకుంటున్నారుట. ఈ డీల్ మీద ఫైనల్ చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ భారీ డీల్ గురించి అనౌన్స్ చేయవచ్చని అంటున్నారు.

రిలయన్స్ దుస్తుల బ్రాండ్ విలువ పెంచుకోవడానికి ఆలియా భట్ ఎడ్ ఏ మమ్మా ఉపయోగపడుతుందని ఇషా అంబానీ భావిస్తున్నారుట. ఆలియా కంపెనీకి చిల్డ్రన్ వేర్ లో మంచి పేరు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే కొన్ని రోజుల క్రితమే ఆలియా తన వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఇషా అంబానీ కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఆలియా డెలివరీ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. అటు తల్లిగా, నటిగా చాలా బి.ీగా ఉన్నారు. అందుకే వ్యాపారాన్ని అంబానీలకు అప్పగిస్తున్నారా అనుకుంటున్నారు.

గతేడాది ఆగస్టులో రిలయన్స్ రిటైల్ హెడ్ గా ఇషా అంబానీని నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ 2 లక్షల కోట్లు. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. జిమ్మీ చూ, జార్జియా అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి బ్రాండ్లతో రిలయన్స్ తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.






Updated : 18 July 2023 12:31 PM IST
Tags:    
Next Story
Share it
Top