Home > సినిమా > బిగ్బాస్ సీజన్ 7లో ఫైనల్ ఎలిమినేషన్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

బిగ్బాస్ సీజన్ 7లో ఫైనల్ ఎలిమినేషన్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

బిగ్బాస్ సీజన్ 7లో ఫైనల్ ఎలిమినేషన్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారంతో ముగియనుంది. అయితే ఫైనల్ వీక్లో ఆరుగురు ఉండటంతో టాప్ 6 ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఎపిసోడ్లోనూ ఎవరూ ఎలిమినేట్ కాకవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫైనల్లో ఆరుగురిని పెడతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ శనివారం ఓ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశాడు.

ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్దీప్, అర్జున్ అంబటి బిగ్బాస్ హౌస్ లో ఉన్నారు. వాస్తవానికి అర్జున్ రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ తాను ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో సీజన్ తొలి ఫైనలిస్ట్ అయ్యారు. ఫలితంగా ఆ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. మిగతా వారితో పోలిస్తే తక్కువ ఓట్లు పడ్డా అర్జున్ నేరుగా ఫినాలే వీక్లో అడుగుపెట్టాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ లో అర్జున్ అంబటిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపినట్లు సమాచారం.

వాస్తవానికి ఐదు వారాల తర్వాత వైల్ కార్డ్ ఎంట్రీగా అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో ఎంటరయ్యాడు. బయట స్టార్ మా బ్యాచ్ కున్న నెగిటివిటీ చూసి వారితో కలవకుండా సింగిల్ గానే ఆడాడు. కానీ ఓట్లు రాబట్టుకోవడంలో మాత్రం అతను ఘోరంగా విఫలమయ్యాడు. సీజన్ ప్రారంభం నుంచే హౌస్లో ఉండుంటే అర్జున్ ఆట మరో రేంజ్లో ఉండేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం సీజన్ ప్రారంభంలోనే అతను ఎంట్రీ ఇచ్చి ఉంటే.. స్టార్ మా బ్యాచ్తో కలిసి పోయేవాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Updated : 16 Dec 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top