పవన్ కల్యాణ్పై అంబటి రాంబాబు సినిమా.. టైటిల్స్ ఏంటో తెలుసా..
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు అటాక్ కొనసాగుతోంది. తాజాగా పవన్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ విశ్వ ప్రసాద్ నుంచి ఆయనకు నిధులు అందుతున్నాయని అంబటి ఆరోపించారు. విశ్వ ప్రసాద్ కు అమెరికాలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. బాబు అమెరికాలో వసూలు చేసి ఆ డబ్బును టీజీ విశ్వ ప్రసాద్ ద్వారా పవన్ కల్యాణ్ కు ఇస్తున్నారని అంబటి ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఎంతడబ్బు తీసుకున్నారో చెప్పాలన్న ఆయన ఈ సొమ్మును ఐటీ రిటర్న్స్ లో చూపించారా ? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు
పవన్ కల్యాణ్ జీవితంపై సినిమా తెరకెక్కించనున్నట్లు మంత్రి అంబటి ప్రకటించారు. కథ రెడీ అవుతోందని అన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిత్య పెళ్లి కొడుకు అని ఒకరు పేరు సూచించారని, మూడు ముళ్లు ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రవీణ్యుడు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి ఎగతాళి, అయిన పెళ్లిళ్లు ఎన్నో పోయిన చెప్పులెన్నో, మ్రో.. మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ తదితర పేర్లు పరిశీలిస్తున్నట్లు అంబటి ప్రకటించారు. ఎవరైనా ఇంకా మంచి పేరు సూచిస్తే వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తామని చెప్పారు. నలుగురు భార్యలు గుణపాఠం చెప్పేలా క్లైమాక్స్ ఉంటుందని అన్నారు.