పవన్ కల్యాణ్‌కు అంబటి రాయుడు కౌంటర్..!
X
ఏపీలో వలంటీర్స్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థపై పవన్ తీవ్ర విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన వాఖ్యలపై వైసీపీ శ్రేణులతో పాటు వలంటీర్స్ మండిపడుతున్నారు. రోడ్డుమీదకు వచ్చి జనసేనానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. వాలంటీర్లకు బాసటగా నిలిచిన ఆయన..పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.
పవన్ కల్యాణ్‌కు అంబటి రాయుడు కౌంటర్..!
గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాయుడు..మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని వాటిని పట్టించుకోవద్దని చెప్పారు. వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనన్నారు. విమర్శలను పట్టించుకోకుండా వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడారు. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని వలంటీర్స్ ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారని.. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు.