Home > సినిమా > అయనతో డేటింగ్.. నా జీవితం నాశనమైంది: అమీషా పటేల్

అయనతో డేటింగ్.. నా జీవితం నాశనమైంది: అమీషా పటేల్

అయనతో డేటింగ్.. నా జీవితం నాశనమైంది: అమీషా పటేల్
X

బద్రి, నాని, నరసింహుడు లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి అమీషా పటేల్. గత కొంతకాలంగా టాలివుడ్ కు దూరంగా ఉన్న అమిషా.. బాలీవుడ్ లో తాజాగా చిత్రం గదర్ 2లో నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీషా.. తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడింది. తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం డైరెక్టర్, ప్రొడ్యూసర్ విక్రమ్ భట్ అని బాంబు పేల్చింది. ఆయనతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు బహిరంగంగా మాట్లాడటం వల్లే ఇలా జరిగిందని తెలిపింది.

‘నేను ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటా. కానీ, ఈ ఇండస్ట్రీలో నిజాయితీకి విలువ లేదు. ఓ వ్యక్తికి నా హృదయంలో చోటివ్వడమే నేను చేసిన తప్పు. నిజాయితీగా దాని గురించి బయటకు చెప్పడంతో నా పరిస్థితి ఇలా అయింది. 12-13 ఏళ్లు సినిమా ఛాన్సులు రాలేదు. నా కెరీర్ దెబ్బతింది. దీంతో మరో పురుషుడికి నా లైఫ్ లో చోటివ్వలేదు. ప్రశాంతత మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమీ కోరుకోవట్లేదు’ అని తెలిపింది.

హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఆప్ ముఝే అచ్చే లగే సినిమాను విక్రమ్ భట్ తెరకెక్కించాడు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అమీషాతో విడిపోతున్నట్లు.. 2008లో విక్రమ్ భట్ ప్రకటించాడు.

Updated : 5 July 2023 8:29 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top