Home > సినిమా > Vyooham: అమితాబ్ను వాడుకున్న ఆర్జీవీ..

Vyooham: అమితాబ్ను వాడుకున్న ఆర్జీవీ..

Vyooham: అమితాబ్ను వాడుకున్న ఆర్జీవీ..
X

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్.. ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంపై తెరకెక్కించిన వ్యూహం. ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా రిలీజ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 23న విడుదల కావాల్సిన సినిమా టెక్నికల్ సమస్యతో చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో మార్చి 2న విడుదల చేస్తామని ఆర్జీవి ట్వీట్ చేశాడు. ఆర్జీవీ మరో సినిమా శపథం కూడా మార్చి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పట్టు వదలని విక్రమార్కున్ని అంటూ ఓ చేత్తో గన్.. మరో చేత్తో సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకున్న దిగిన ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆర్జీవీ ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఈ ప్రమోషన్స్ కోసం ఆర్జీవీ.. ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నే వాడుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమితాబ్ ను ఆర్జీవీ డెన్ కు ఆహ్వానించాడు. షూటింగ్ అనంతరం నేరుగా ఆర్జీవీ డెన్ కు వెళ్లాడు అమితాబ్. ఇక అక్కడ అమితాబ్ తో పాటు ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ తో కూడా భేటీ అయ్యాడు ఆర్జీవీ. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. వ్యూహం విత్ అమితాబ్ అంటూ రాసుకొచ్చాడు.

కాగా వ్యూహం విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సినిమా విడుదలపై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. అప్పటివరకు సినిమా విడులపై స్టే ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ సినిమాలో చంద్రబాబు , పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ లోకేశ్ కోర్టుకు వెళ్లారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత హైకోర్టును కోరారు.

Updated : 28 Feb 2024 4:31 PM IST
Tags:    
Next Story
Share it
Top