సినిమాల్లోకి అమృత ప్రణయ్..? కార్తికేయతో కలిసి...
X
మిర్యాలగూడ పరువు హత్య గురించి అందరికీ తెలిసిందే. ప్రణయ్ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. కూతూరి ప్రేమను అంగీకరించని తండ్రి మారుతీ రావు ప్రణయ్ను చంపించాడు. ఆ తర్వాత కొన్ని రోజులుగా మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ మరణం తర్వాత అమృత అత్తవారింట్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివే. తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి పలు వీడియోలను అప్ లోడ్ చేస్తోంది.
అమృత ప్రణయ్ సినిమాల్లోకి వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోనే కారణం. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో కార్తికేయతో డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల పాటకు కార్తీకేయ ఆడిపాడింది. కార్తికేయ నటించిన బెదురులంక 2012 మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చీరకట్టులో అమృత ప్రణయ్ చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అమృత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా..అమృత ప్రణయ్ పెర్ఫామెన్స్‌ని అభినందిస్తూ ఫైర్ అండ్ లవ్ ఎమోజీలను షేర్ చేసింది.