Amy Jackson: ‘లేడీ ఓపెన్‌హైమర్’.. ఇలా మారిపోవడానికి కారణం అదేనట?
X
"ఐ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమీ జాక్సన్". తన అందం, అభినయంతో చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.(Amy Jackson) ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమీ.. తాజాగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (Amy Jackson new movie) దాంతో ఆమె లుక్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఐరిష్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలి ఉన్న అమీ జాక్సన్ ఫొటోను పట్టుకుని లేడీ ఓపెన్‌హైమర్ అని ట్యాగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై అమీ జాక్సన్ తాజాగా స్పందించింది.
‘నా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ట్రోల్స్ రావడం నిజంగా బాధాకరం. నటులు.. సినిమాలకు అనుగుణంగా తమ లుక్ మార్చుతుంటారు. నేనూ అదే చేశా. వేరే ఎవరైనా సినిమా కోసం లుక్ మార్చితే ప్రశంసిస్తారు. కానీ నన్నేమో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం యూకేలో ఓ సినిమా చేస్తున్నా. దానికోసమే లుక్ మార్చా. అయినా సిలియన్ మర్ఫీ లుక్ తో పొల్చితే నేనేం బాధపడటం లేదు. ఆనందిస్తున్నా’అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫొటోషూట్ లో పాల్గొన్న అమీ.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి చూసి షాకైన ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు.