Home > సినిమా > Gunturu Karam Movie :గుంటూరు కారం నుంచి అన్ ఎక్స్ పెక్టెడ్ అప్డేట్

Gunturu Karam Movie :గుంటూరు కారం నుంచి అన్ ఎక్స్ పెక్టెడ్ అప్డేట్

Gunturu Karam Movie  :గుంటూరు కారం నుంచి అన్ ఎక్స్ పెక్టెడ్ అప్డేట్
X

పండగలు వస్తున్నాయంటే చాలు.. మూవీ మేకర్స్ కు ఓ పెద్ద టాస్క్ కూడా వస్తుంది. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల సినిమాల వరకూ ఫ్యాన్స్ పండగ సందర్భంగా ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అటు మేకర్స్ ప్రాబ్లమ్స్ తో వీరికి పనిలేదు. అఫ్ కోర్స్ అవసరం కూడా లేదు. స్టార్ హీరోల సినిమాలను ఎలా ఉన్నా పోషించేది వీరే కాబట్టి ఎదురుచూడ్డంలో తప్పేం లేదు. అలా చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న మహేష్ మూవీ గుంటూరు కారం నుంచి ఏం అప్డేట్ రాబోతోందా అని ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో హాట్ హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఈ దసరాకు గుంటూరు కారం నుంచి వస్తోన్న ఆ ఘాటైన అప్డేట్ ఏంటో తెలుసా..?

అన్నీ కుదిరి ఉంటే ఈ యేడాది సంక్రాంతికే విడుదల కావాల్సిన సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న నాలుగో సినిమా కావడంతో అంచనాలున్నాయి. మొదట అనుకున్న కథ కాదని వేరే స్టోరీతో వస్తుండటంతో ఆలస్యం అవుతోంది. ఈ కారణంగానే మొదట అనుకున్న టాప్ టెక్నీషియన్స్ అంతా మారిపోయారు. ఓ దశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అన్నీ దాటుకుని మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. 2024 సంక్రాంతికి విడుదల కాబోతోన్న గుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది కానీ ఇప్పటి వరకూ ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వస్తుందని ఆగస్ట్ లో మహేష్ బాబు బర్త్ డే టైమ్ నుంచీ వినిపిస్తోంది. బట్ ఇప్పటి వరకూ ఎలాంటి సాంగ్ రాలేదు. థమన్ ఆల్రెడీ ట్యూన్ రెడీ చేసి పాట చేయించాడట. అయితే ఆ పాట కోసం వీడియో రెడీగా లేదు అని టాక్. అంటే షూటింగ్ చేయాలన్నా శ్రీ లీల బిజీ వల్ల సాధ్యం కాలేదు అని చెబుతున్నారు. కానీ నిజం అది కాదు. ఈ పాట మహేష్ కు నచ్చలేదంటున్నారు. అయినా త్రివిక్రమ్ ఒప్పించాడట. ఒకవేళ లిరికల్ సాంగ్ నే విడుదల చేసినా అందులో యానిమేషన్ బొమ్మలు మాత్రమే ఉంటాయి తప్ప షూటింగ్ కు సంబంధించి విజువల్స్ కానీ.. మహేష్, శ్రీ లీల కలిసి ఉన్న విజువల్స్ కానీ ఉండవు అంటున్నారు. మరి మహేష్ బాబు కాకుండా యానిమేషన్స్ లో పాటంటే ఆడియన్స్ మాట అటుంచితే ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా అనేది ఒక ప్రశ్న అయితే అసలు దసరాకు పాట విడుదల చేస్తున్నారా లేక ఇంకేదైనా సింపుల్ పోస్టర్ వదులుతారా అనే సందేహమూ లేకపోలేదు. మొత్తంగా ఈ రెండిటిలో ఏదో ఒక అప్డేట్ అయితే గుంటూరు కారం నుంచి వస్తుందంటున్నారు.


Updated : 17 Oct 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top