అందుకే 'లైగర్' ఫ్లాప్ అయ్యింది..ఆనంద్ దేవరకొండ
X
గత ఏడాది భారీ అంచనాలతో విడులైన పాన్ ఇండియన్ సినిమా లైగర్ ఘోర పరాజయాన్ని అందుకుంది. మొదటి పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ ఇమేజ్‌ని భారీగానే డ్యామేజ్ చేసింది. సినిమా నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టాన్ని భరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లైగర్ ఫ్లాప్ గురించి విజయ్ తమ్ముడు ఆనంద దేవరకొండ కామెంట్ చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.."అన్న వాయిస్ కు అమ్మాయిలంతా ఫిదా అవుతారు. ఆయన వాయిస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అన్నను లైగర్ సినిమాలో నత్తి వాడిగా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు. మా అన్నయ్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. శారీరకంగా మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాడు. కానీ ఏం చేస్తాం..మార్నింగ్ షోకే లైగర్ రిజల్ట్ తెలిసిపోయింది"అని ఆనంద్ దేవరకొండ్ తెలిపాడు.
లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ముందు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్లో సమంత జోడీగా చేస్తున్న ‘ఖుషి’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇదే సమయంలో అటు గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ సినిమాల షూటింగ్ కూడా రీసెంట్‌గానే ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా ‘పుష్పక విమానం’ సినిమా అనంతరం ఆనంద్ ‘బేబీ’ చిత్రం చేశాడు. సాయి రాజేశ్ దర్శకత్వంలో, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ జులై 14న విడుదల కానుంది.