Home > సినిమా > సోషల్ మీడియాను ఏలేస్తున్న ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాను ఏలేస్తున్న ఆనంద్ మహీంద్రా

సోషల్ మీడియాను ఏలేస్తున్న ఆనంద్ మహీంద్రా
X

సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా జోరు మామూలుగా లేదు. ప్రతీ చిన్న విషయాన్ని పోస్ట్ ల రూపంలో పెడుతూ దాని కింద క్యాప్షన్స్ రాసేస్తున్నారు. ఆనంద్ మహీంద్రాను ఫాలో అయ్యేవాళ్ళుకూడా చాలా మందే ఉంటారు. ఆయన పెట్టిన పోస్ట్ లను ఫాలో అవుతూ లైక్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ పెట్టిన రెండు పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఒకటి బాలీవుడ్ బాద్షా గురించి అయితే మరొకటి ఓ ఏనుగు వీడియో గురించి.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ కి 57ఏళ్ళు అంటే ఎవరు నమ్ముతారు అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆయన వయసు పెరుగుతున్నట్టు ఉంది. మిగతావారి కంటే పదిరెట్లు ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. దీనికి అంతే వేగంగా షారూక్ ఖాన్ కూడా స్పందించారు. ఈ స్పీడును అందుకునేందుకు ట్రై చేస్తున్నా. సంతోషం, దుఖం, డ్యాన్స్, చుక్కల్లో విహరించేలా భావన కల్పించడం.. ఇలా ఎలా వీలైతే అలా వీలైనంతమందికి వినోదం పంచేందుకు ప్రయత్నిస్తున్నా. సంతోషమైన క్షణాల కోసం కలకంటున్నా అని రిప్లై ఇచ్చారు. ఇద్దరి సంభాషణ విన్న నెటిజన్లు కూడా తమదైన కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరోవైపు తన ఫాలోవర్లలో స్ఫూర్తిని నింపేందుకు ఓ ఏనుగు వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ ఏనుగు రోడ్డు దాటేందుకు వెళుతూ అడ్డంగా ఉన్న కంచెను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. స్వభావసిద్ధంగా కంచెను తోసుకుంటూ వెళ్ళిపోకుండా మందు దాన్ని ఒకసారి తాకి చూసి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసాకనే కాలితో స్తంభాన్ని నెడుతుంది. మొత్తం వీడియో 45 సెకన్లు ఉంది. అడ్డంకులను ఎలా అధిగమించాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. మనకు ఎదురయ్యే సవాలు ఎంత బలమైనదో జాగ్రత్తగా పరిశీలించాలి. అది తెలుసుకున్నప్పుడే సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్ధమవుతుంది, అప్పుడే విజయం సొంతం అవుతుంది అంటూ రాసుకొచ్చారు. విజయం వస్తే అప్ుడు ఏనుగులాగ గర్వంగా నడవండి అంటూ సలహా కూడా ఇచ్చారు.

ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ వీడియోను ఆరు గంటల్లో మూడు లక్షల మంది చూశారు. ఆనంద్ ప్రతీ చిన్న విషయాన్ని ఇంత చక్కగా విశ్లేషించడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి దిగ్గజాలు మాత్రమే ప్రతీ చిన్న విషయం నుంచీ పాఠాలు నేర్చుకుంటారని కామెంట్ చేస్తున్నారు.


Updated : 4 Aug 2023 7:57 PM IST
Tags:    
Next Story
Share it
Top