Tantra : పిల్ల బచ్చాలకు అనన్యనాగళ్ల 'తంత్ర' వార్నింగ్
X
సినిమాకు సెన్సార్ ఎంత కీలకమో వేరే చెప్పక్కర్లేదు. చాలా వరకూ క్లీన్ యూ సర్టిఫికెట్ రావాలనే అనుకుంటారు చాలామంది. యాక్షన్ మూవీస్ కి అయితే యూ/ఏ వరకూ ఓకే. అదే ఏ సర్టిఫికెట్ వస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడతారు. ఇలాంటి సినిమాలకు 18యేళ్ల లోపు వారిని రానివ్వరు. టివిల్లో వేసేటప్పుడూ.. చాలా సీన్స్ కట్ అవుతాయి. అందుకే ఏ సర్టిఫికెట్ సినిమా అంటే మేకర్స్ కు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నిజానికి ఏ సర్టిఫికెట్ అనగానే చాలామంది ‘ఆ టైప్’ మూవీస్ అనుకుంటారు. బట్ రక్తపాతం ఎక్కువగా ఉన్నా, భయపెట్టే సన్నివేశాలున్నా.. ఏ సర్టిఫికెట్ వస్తుంది. అందుకే తంత్ర మూవీ టీమ్ తమకు ఏ సర్టిఫికెట్ రాగానే చాలా హ్యాపీగా.. ఇంకా చెబితే వెరైటీగా రియాక్ట్ కావడం విశేషం.
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్, పాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. 'ధీరే ధీరే' సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది.
లేటెస్ట్ గా తంత్ర సినిమాకు సెన్సార్ అయింది. బోర్డ్ నుంచి వీరికి ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీనికి రియాక్షన్ గా ‘‘ మా సినిమాకి పిల్ల బచ్చాగాళ్లు రావద్దని హెచ్చరిస్తూ.. ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఏ అనే అక్షరాన్ని హైలెట్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇది చూసి చాలామంది.. ఓర్నీ ఇదేదో సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీలాగా ఉందే అని ఆశ్చర్యపోతున్నారు. హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. ఇతను శ్రీకాకుళంలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వాల్ట్ డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగాడు. సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవి చైతన్య అనౌన్స్ చేశారు..
మొత్తంగా ఏ సర్టిఫికెట్ పై ఇలా డిఫరెంట్ గా రియాక్ట్ అయిన ఫస్ట్ మూవీ టీమ్ వీరిదే అని చెప్పొచ్చు.