ఆ హీరోతో అడ్డంగా దొరికిన ‘లైగర్’ హీరోయిన్.. ఫొటోలు సోషల్ మీడియాలో లీక్..!
X
సినీ ఇండస్ట్రీలో లవ్ స్ట్రోరీ ట్రెండ్ నడుస్తోంది. రోజుకో కొత్త జంట గురించి వార్తలు బయటికి వస్తున్నాయి. అభిమానుల కంట పడకుండా విదేశాలకు డేటింగ్ వెళ్తున్నారు. వాళ్ల రిలేషన్ షిప్ ను ఎంత సీక్రెట్ గా ఉంచినా.. ఏదో ఒక చోటు దొరికేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట కెమెరాకు చిక్కింది. డేటింగ్ లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా లవ్వాట ఆడుతున్న ఆ జంట ఎవరంటే..
బాలీవుడ్ లవర్ బాయ్ ఆదిత్యా రాయ్ కపూర్, లైగర్ బ్యూటీ అనన్య పాండే ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్పెయిన్ లో ఓ ఈవెంట్ కు హాజరైన ఈ లవ్ బర్డ్స్.. అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేశారు. ఓ బ్రిడ్జ్ పై తిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాదించారు. ప్రస్తుతం ఆ ఫొటోలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో వీళ్లిద్దరు క్లోజ్ గా ఉండటం ఒక ఎత్తైతే.. మరో దాంటో గట్టిగా హగ్ చేసుకున్న ఫొటో రచ్చ లేపుతోంది. ఈ ఫొటోతో అన్ని రూమర్స్ కు తెర పడింది. అయితే, వీళ్లిద్దరి నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని, అతని లుక్స్ బాగుంటాయని తెలిపింది.