Home > సినిమా > కాబోయే వాడు నాతో అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా

కాబోయే వాడు నాతో అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా

కాబోయే వాడు నాతో అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా
X

లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది అనన్య పాండే. ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనన్య.. తరచుగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ హీరో ఆదిత్యా రాయ్ కపూర్ తో లవ్ ట్రాక్ నడుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోయినా.. కార్లో షికారు చేస్తూ, విదేశాల్లో డేటింగ్ చేస్తూ పలుమార్లు కెమెరాలకు చిక్కారు. దీంతో ఆ పుకార్లను కాస్త నిజమని నమ్ముతున్నారు. అనన్య ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటిస్తోంది. ఆగస్ట్ 25న విడుదల కానున్న ఈ సినిమాకోసం ప్రమోషన్స్ లో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య.. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యే సమాధానం చెప్పింది.

మీకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని అడగగా.. ‘నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వాడు కూడా మా నాన్నలా.. దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలని కోరుకుంటా. మా నాన్నే నాకు బెంచ్‌మార్క్. ఆయన అత్యుత్తమ వ్యక్తి. అందుకే నాకు కాబోయే వ్యక్తికి కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇప్పటివరకు సినిమాలు అంతగా లేకపోవడంతో.. నా వ్యక్తిగత జీవితంపైనే చాలామంది చర్చలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ల దృష్టి నా లైఫ్ పై కాకుండా.. నా సినిమాలపై పెడతారేమోనని వెయిట్ చేస్తున్నా’అని చెప్పుకొచ్చింది.

Updated : 22 Aug 2023 8:44 PM IST
Tags:    
Next Story
Share it
Top