Home > సినిమా > అనసూయపై విజయదేవరకొండ ట్రోలింగ్ చేయిస్తున్నాడా ?

అనసూయపై విజయదేవరకొండ ట్రోలింగ్ చేయిస్తున్నాడా ?

అనసూయపై విజయదేవరకొండ ట్రోలింగ్ చేయిస్తున్నాడా ?
X

యాంకర్ అనసూయ..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు...తదితర అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమె చేసిన పోస్ట్స్ కొన్నిసార్లు వివాదాలను సృష్టిస్తాయి. ఈ క్రమంలోనే ఆమె విపరీతమైన ట్రోలింగ్‌కు కూడా గురవుతారు. ‘ఆంటీ’ అంటూ అనసూయను నెటిజన్లు ఆటపట్టిస్తారు. అయితే తన ట్రోలింగ్ వెనుక ఓ హీరో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఈ ఫ్రైర్ బ్రాండ్.

రౌడీ హీరో విజయదేవరకొండకు, అనుసూయకు కొంచెం గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్‌కు వ్యతిరేకంగా ఆమె పలు ట్వీట్ చేశారు. దీంత రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహానికి అనుసూయ గురికావాల్సి వచ్చింది. ఇటీవల కూడా మరోసారి విజయ్‌ను అనుసూయ టార్గెట్ చేసింది. విజయ్ తాజాగా నటిస్తున్న సినిమా ఖుషీ పోస్టర్‌లో విజయ్ పేరుకు ముందు ‘ది’ అని ఉంది. దానిని హైలెట్ చేస్తూ అనుసూయ ట్వీట్ చేసింది. ది’ నా.. బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం అంటూ ఒక పోస్ట్ షేర్ చేసారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఏకిపారేశారు.

తాజాగా విజయ్‌తో ఉన్న గొడవలపై అనసూయ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో అనుసూయ మాట్లాడుతూ.. "విజయ్‌తో గతంలో నాకుమంచి స్నేహం ఉంది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. 2017లో అర్జున్‌ రెడ్డి సినిమా రిలీజైంది. ఈ క్రమంలో విజయ్‌ ఓ థియేటర్‌కు వెళ్లి సినిమాలో ఉన్న బూతు పదాలను బయట మాట్లాడాడు. ఇది నాకు నచ్చలేదు. నిజ జీవితంలో అలా ఉండొద్దని సూచించాను. ఆ తర్వాత నాపై ట్రోలింగ్ మొదలైంది. 2019లో విజయ్ నిర్మాణంలో మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో నాకు అవకాశం వచ్చింది. దీంతో గొడవలు సద్ధుమణిగాయి అనుకున్నాం. కానీ ఆ సమయంలో నాకో నిజం తెలిసింది. విజయ్ దేవర్ కొండ వద్ద పనిచేసే ఓ వ్యక్తి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది. ఇది విని నేను షాకయ్యాను. డబ్బులిచ్చి మరీ నాపైకి అభిమానులను ఉసిగొల్పుతున్న వ్యక్తి విజయ్‌కు తెలియకుండానే ఇదంతా చేస్తాడా? అని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయ వ్యాఖ్యలపై రౌడీ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్టవుతారో చూడాలి మరి.

Updated : 9 Jun 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top