Home > సినిమా > పుష్ప-2 కోసం ముస్తాబవుతున్న అనసూయ

పుష్ప-2 కోసం ముస్తాబవుతున్న అనసూయ

పుష్ప-2 కోసం ముస్తాబవుతున్న అనసూయ
X

పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్యగా, దాక్షాయణి పాత్రలో అదరగొట్టిన అనసూయ.. మరోసారి తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) వస్తున్న ఈ సినిమాలోని అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మధ్యే రిలీజ్ కాగా... సినీ అభిమానుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇక ఇందులో అనసూయ రోల్ మరింత పవర్‌పుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. నిజానికి సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. రీసెంట్ షెడ్యూల్‌లో మూవీ టీమ్‌తో జాయిన్ అయింది అనసూయ.





తాజాగా మేకప్ రూమ్‌లో దాక్షాయణి పాత్రకు రెడీ అవుతూ తీసుకున్న మిర్రర్ సెల్ఫీ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు దీనికి ‘పుష్ప: ది రూల్’ అనే క్యాప్షన్‌తో ఫైర్ ఎమోజీస్ యాడ్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. షూటింగ్ స్పాట్ ఎక్కడ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని ఆమెపై అభిమానాన్ని చాటుకుంటున్నారు మరికొందరు.

ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్‌లోని విజువల్స్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రత్యేకించి పుష్పరాజ్‌కు ఇచ్చిన ఎలివేషన్లు చూసి అల్లు ఫ్యాన్స్‌.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల్లో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ ప్రకారం ‘పుష్ప 2’ ఫస్ట్ పార్ట్‌కు మించి ఉంటుందని భరోసానిస్తున్నాయి.






Updated : 27 Jun 2023 10:33 AM IST
Tags:    
Next Story
Share it
Top