Home > సినిమా > మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదు..పెళ్లిరోజు అనసూయ ఎమోషనల్ పోస్ట్

మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదు..పెళ్లిరోజు అనసూయ ఎమోషనల్ పోస్ట్

మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదు..పెళ్లిరోజు అనసూయ ఎమోషనల్ పోస్ట్
X

బుల్లితెరలో అనసూయ ఎంట్రీ ఇచ్చిన తరువాత యాంకర్ల తీరే పూర్తిగా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు హీరోయిన్‎లు మాత్రమే గ్లామర్‎గా కనిపిస్తారు అన్న పేరుండేది. కానీ బుల్లితెరమీద కనిపించే యాంకర్లు కూడా అందాల ఆరబోతలో తక్కువేమి కాదని నిరూపించింది అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన అందాలతో, యాంకరింగ్‎తో ఇప్పటికీ తన అభిమానులను అలరిస్తుంటుంది ఈ బ్యూటీ. యాంకర్‎గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ కొద్ది రేంజుల్లోనే సుమ తరువాత అంతటి క్రేజ్‎ను దక్కించుకుంది. ఓ వైపు సినిమాలు మరో వైపు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‎గా ఉంటుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ అప్పుడప్పుడు ట్రోలింగ్‎కు గురవుతుంటుంది. తాజాగా అనసూయ తన పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్‎లో ఓ వీడియోను పోస్ట్ చేసి భర్తను ఉద్దేశిస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‎గా మారింది.



ఈ పోస్ట్ లో అనసూయ ప్రేమ, పెళ్లి గురించి ఎమోషనల్ అయ్యింది. "2001లో నాకు నువ్వు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ అప్పుడు నీకు సమాధానం ఇవ్వలేకపోయాను. అందుకే మన పెళ్లి రోజు సందర్భంగా నీపై నాకున్న ప్రేమను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మన పెళ్లి అయినప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా నిన్ను ఎన్నో మాటలు అన్నారు. వాటిని అస్సలు పట్టించుకోకుండా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. మన పెళ్లి బంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు. నా కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు .ఒక్కోసారి నువ్వు నాపై చూపించే ప్రేమకు, సహనానికి ఆశ్చర్యం వేస్తుంది. నన్ను నువ్వు, నిన్ను నేను అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. మనం పర్‌ఫెక్ట్‌ కపుల్‌ కాదని నాకు తెలుసు. కానీ ఎలాంటి సమయంలో అయినా ఒకరికొకరం కలిసే ఉంటాం. నన్ను నన్నుగా స్వీకరించినందుకు ధన్యవాదాలు" అంటూ తన భర్తపై ఉన్న భావాలను చెప్పుకొచ్చింది అనసూయ.











Updated : 5 Jun 2023 9:00 AM IST
Tags:    
Next Story
Share it
Top