Home > సినిమా > అరే అనసూయ ఏంటి ఇలా మారిపోయింది?

అరే అనసూయ ఏంటి ఇలా మారిపోయింది?

అరే అనసూయ ఏంటి ఇలా మారిపోయింది?
X

అనసూయా భరద్వాజ్....యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి గ్లామర్ గాళ్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్ లాంటి వాళ్ళు తమ సినిమాల్లో అనసూయకు కీ రోల్స్ ఇస్తున్నారు. అలాగే అను బేబీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలు, కాంట్రవర్శీలతో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండడానికి ట్రై చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.





అనసూయ సడెన్ గా దేశం కోసం పోరాడిన హజ్రత్ మహల్ లా మారిపోయింది. అచ్చు ఆమెలానే గెటప్ వేసుకున్న ఫోటోను జత చేస్తూ ఆమె గొప్పదనం గురించి రాస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 1857 కాలంనాటి స్వాతంత్ర్య యోధురాలు, అవాధీ క్వీన్ బేగం హజరత్ మహల్ దేశం కోసం పోరాడారు. దానికి గుర్తుగా 1984లో ప్రభుతంవం ఓ స్టాంప్ కూడా విడుదల చేసింది. తన పోరాటంలో అందరిలోనూ స్ఫూర్తిని నింిపన హజరత్ ను మరో సారి గుర్తు చేసుకుందాం అంటూ...ఆమెలా మేకప్ చేసుకుని ఉన్న తన ఫోటోను పెట్టింది అనసూయ. హజ్రత్ ను అభినవ లక్ష్మీభాయ్ అని కూడా అంటారు.

హజ్రత్ ఫోటోను రిక్రియేట్ చేసిన అనసూయ...ఆ అటైర్ లో మెరిసిపోయింది. ముస్లిం యువతిగా చక్కగా అమరింది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు అనసూయ ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం పుష్ప-2లో అన్ను బేబీ నటిస్తోంది.


Updated : 14 Aug 2023 5:12 PM IST
Tags:    
Next Story
Share it
Top