Home > సినిమా > Anasuya Bharadwaj: ‘సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం’: అనసూయ

Anasuya Bharadwaj: ‘సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం’: అనసూయ

Anasuya Bharadwaj: ‘సావిత్రిలా నటించడం ఎంత కష్టమో.. ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంతే కష్టం’: అనసూయ
X

యాంకర్ గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తనలోని సరికొత్త కోణాన్ని అభిమానులకు చూపిస్తూ.. మెప్పించింది. కాగా తాజాగా జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో అలనాటి నటులు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను రీ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా పెర్ఫామెన్స్‌తో లెజండరీ నటీమణులకు నివాళి అర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని రాసుకొచ్చింది. ఆ ఫొటోను చూసిన అభిమానులు కొందరు అనసూయను ప్రశంసించగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

‘ఎక్స్పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. దానికి అనసూయ రిప్లై ఇచ్చింది. ‘కరెక్ట్ గా చెప్పారండి. సామిత్రమ్మలా యాక్ట్ చేయడం ఎవరి తరం కాదు. నేను వాళ్లకు నివాళి అర్పించానంతే. అలాగే ఎక్స్ పోజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ప్రిపేర్ అవ్వాలి. అంతే కాన్ఫిడెంట్ గా దాన్ని పాత్రను, డ్రెస్ ను వ్యక్తపరచాలి’ అని సమాధానం ఇచ్చింది.

Updated : 30 Oct 2023 9:34 AM IST
Tags:    
Next Story
Share it
Top