మామిడి తోటలో అనసూయ హల్ చల్..ఫోటోలు వైరల్
X
అనసూయ భరద్వాజ్ ఈ పేరు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఓ వైపు యాకంగర్గా బుల్లితెరపైన సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటోంది అనసూయ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది . చాలా విషయాల్లో ఓపెన్‌గా మాట్లాడటమే కాదు ,తనను ట్రోల్ చేసే వారికి గట్టిగానే సమాధానం చెబుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటుంది.
లేటెస్టుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న అనసూయ తన సోషల్ మీడియాల అకౌంట్ లో భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ మధ్యనే మాల్దీవ్స్ లో భర్తతో దిగిన రొమాంటిక్ పిక్స్ ను పోస్ట్ చేసి విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది అనసూయ. అయినప్పటికీ తన జోరును ఆపలేదు. తాజాగా భర్తతో కలిసి మామిడి తోటలో హల్ చల్ చేసింది అనసూయ. మామిడి చెట్లకు ఉన్న పండ్లను కోస్తూ తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తోటలో దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ చిత్రాలలో అనసూయ బుల్లి నిక్కరు, స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని కనిపిస్తుంది. భర్త భరద్వాజ్ అనసూయన ఎత్తుకోగా ఆమె మామిడి పండ్లను కోస్తుంటుంది. ఈ పిక్స్ కాస్త నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లివేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు.