Anasuya: బికినీ వీడియో షేర్ చేసిన అనసూయ.. నెటిజన్ల ట్రోల్స్ షురూ...
X
అనసూయ భరద్వాజ్.. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి గ్లామర్ గర్ల్గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీకి కేరాఫ్గా నిలుస్తుంది. తన ఫోటోలు, వివాదాలతో ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండడానికి ట్రై చేస్తుంటుంది. తాజాగా పాత బికినీ వీడియోను ఇన్స్టాలో మళ్లీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అనసూయ తన భర్తతో బీచ్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె బికినీలో ఉంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మళ్లీ ఏడుస్తావ్ పక్కా అని ఒకరు అంటే.. నువ్వు చూపిస్తే తప్పులేదు అంటూ మరొకరు కామెంట్ చేశారు. తమకు ఇలాంటి వీడియోలే కావాలంటూ ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. అనసూయ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అనసూయ నటించిన పెదకాపు 1 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.