ఆ అలవాటే ముందుకు నడిపిస్తోంది.. అనసూయ
X
వరుస సినిమాలతో బిజిబిజీగా గడిపేస్తోంది హాట్ బ్యూటీ అనసూయ. ఇటీవలే ఆమె నటించిన తాజా చిత్రం విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించినందుకు పలు ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అనసూయ.. అందం కోసం బాగానే కష్టపడుతుంది. వ్యాయామం(వర్కవుట్స్ ని) తన దిన చర్యలో భాగం చేసుకుంది. ఇక జిమ్ చేయడం అలవాటుగా మారిపోయిందంటూ కామెంట్ చేసింది. జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తూ.. తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. 14 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత వర్కౌట్ పోస్ట్ చేస్తున్నాను అంటూ తన తాజా ఫోటోలను షేర్ చేసింది.
ఇక అనసూయ క్రేజీ ప్రాజెక్ట్ .. పుష్ప 2లోనూ నటిస్తోంది. మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనుంది. ఇక మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారట. కానీ ప్రస్తుతం టీవీలో వచ్చే కొన్ని షో ల మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదని, అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె అంటోంది. అనసూయకు ఫేమ్ కి జబర్దస్త్ షోనే కారణం. జబర్దస్త్ షో ఆమెను షో స్టార్ ని చేసింది. ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్డమ్ మొత్తం జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక అనసూయ ఆరోపణలు చేయడం కొసమెరుపు. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె అన్నారు.