అనసూయకు అనారోగ్యం.. సోషల్ మీడియా ఇలా తయారైందేంటంటూ పోస్ట్..
X
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆమె చేసే ఓ ట్వీట్ కోసం ట్రోలర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న ఈ బొద్దుగుమ్మ ఎప్పుడు టైం దొరికినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన పోస్టులతో నెటిజన్లని ఏదో రకంగా ఎంగేజ్ చేస్తుంది. పాజిటివైనా నెగటివైనా వార్తల్లో ఉండేలా చూసుకునే అనసూయ.. 4 రోజుల తర్వాత తాజాగా ట్వీట్ చేసింది. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ అనసూయ వరుస ట్వీట్స్ చేసింది.
‘‘5 రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నా. దీంతో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో ఉండే అవకాశం దొరికింది. ఇక్కడ ఎన్నో విషయాలు గుర్తించా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకపోవడం చూశా. వేధింపులు ఉన్నాయి. హుందాతనం లోపించడం చూసి.. మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయా’’ అని ట్వీట్లో రాసుకొచ్చింది.
నెటిజన్ల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్‌ను ఉద్దేశిస్టూ అనసూయ మరో ట్వీట్ చేసింది. సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్న వారందరూ ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పీఆర్ ప్రమోషన్స్ లేకుండా.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. తమ సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకుని ఈ స్థాయికి వచ్చారు. అందుకే వారి ప్రయాణాన్ని గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని విమర్శించాలంటే అది వివరణాత్మకంగా ఉండాలని అనసూయ ట్వీట్ చేసింది.4 రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయని అనసూయ పనిలో పనిగా హేటర్స్ను కెలికింది. వాళ్లను రెచ్చగొట్టేలా ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. ద్వేషించే వారందరికీ ఓ మెసేజ్ అంటూ "నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చేసేదంతా మీరు చూస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటికీ మీరు నా అభిమానే` అని అందులో రాసుకొచ్చింది.
హేటర్స్ను ఉద్దేశించి అనసూయ ఇన్ స్టా పోస్ట్పై రచ్చ మొదలైంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎందుకు మేడం నిద్రపోతున్న సింహాలను లేపుతారు అని, రెచ్చగొట్టడం అంటే ఇదే మరి, నిప్పులపై ఉప్పు చల్లి మళ్లీ రచ్చ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. చాలా వరకు అనసూయకి మద్దతు ప్రకటిస్తున్నారు. హేటర్స్ ఎవరూ లేరని, కొన్నిసార్లు మీరు చేసే పనులను ట్రోల్స్ చేయాల్సి వస్తుందని అంటున్నారు.
Have been down with viral since 5 days.. so have plenty of time to be on social media.. so came across so many things.. it’s alarming.. the unjust.. the unkindness.. the abuse.. the mere lack of being civilised.. makes me wonder where we are heading..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 16, 2023