Home > సినిమా > వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అన్ని రోజులు ఒకేలా ఉండవంటూ..

వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అన్ని రోజులు ఒకేలా ఉండవంటూ..

వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అన్ని రోజులు ఒకేలా ఉండవంటూ..
X

అనసూయ భరద్వాజ్.. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి గ్లామర్ గర్ల్గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పుడూ ఏదో ఓ కాంట్రవర్సీకి కేరాఫ్గా నిలుస్తుంది. తన ఫోటోలు, వివాదాలతో ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండడానికి ట్రై చేస్తుంటుంది. స్ట్రాంగ్ లేడీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు హఠాత్తుగా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.





అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ కన్పించింది. ‘‘నా పోస్ట్‌ చూసి మీరందరూ గందరగోళానికి గురై ఉంటారు. నాకు తెలిసినంతవరకు సోషల్‌ మీడియా అనేది సమాచారాన్ని పంచుకునేందుకు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్‌ చేసుకునేందుకే సోషల్‌ మీడియా ఉంది. ఆశ్చర్యమేంటంటే.. నిజంగా అదే జరుగుతోందా?’’ అని ప్రశ్నించింది.





‘‘నేను ఏ ఫోటోషూట్‌ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్‌ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్‌ ఇచ్చినా మీతో షేర్‌ చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగం. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను ఎంతో కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్‌ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్‌లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీకు చెప్పాలనుకున్నాను' అని రాసుకొచ్చింది.


ఇక ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల క్రితం తీసింది అని అనసూయ తెలిపింది. తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు చెప్పింది. అయితే అనసూయ ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్‌. ఈ క్రమంలోనే ఆమె అప్‌సెట్‌ అయి ఏడ్చినట్లు సమాచారం.

Updated : 19 Aug 2023 4:29 PM IST
Tags:    
Next Story
Share it
Top