వానల్లో ఇబ్బందిగా ఉందా? ఫోన్ చేయండి
X
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌ను పలకరిస్తుంటుంది. తాజాగా రష్మీ తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని విషయాలను పంచుకుంది . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపైన రష్మీ మాట్లాడింది. ఇలాంటి ఇలాంటి సమయంలో మూగ జీవాల సంరక్షణ కష్టతరం గురించి చెప్పుకొచ్చింది.
రష్మీకి మూగ జీవాలంటే ఎంత మమకారమో అందరికీ తెలుసు. ఆమె తరచుగా సోషల్ మీడియా వేదికగా పెట్స్‌తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంటుంది. కుక్కలు, ఇతర జంతువుల బాధలను తన బాధగా ఫీల్ అయ్యే వ్యక్తి రష్మీ. మూగ జీవాలుఎక్కడైనా రోడ్డు పక్కన పడి ఉన్నా, గాయాలతో కనిపించినా వాటిని రెస్క్యూ చేస్తుంటుంది. అలా ఓ కుక్కను ఇంటికి తెచ్చుకుని మరీ పెంచుకుంటోంది. కరోనా సమయంలో అయితే రష్మీ హైదరాబాద్ నగర వీధుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎన్నో నోరులేని మూగజీవాలకు తనవంతు సాయంగా ఆహారాన్ని అందించి వాటిని ఆదుకుంది. ఫారిన్ బ్రీడ్లు వద్దు , లోకల్ బ్రీడ్లను పెంచుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పెట్ లవర్లకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటుంది.
ఇదే క్రమంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో బోరున కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఓ ఎమోషనల్ వీడియోను రష్మీ తన ఇన్స్టాగ్రాం స్టోరీలో పోస్ట్ చేసింది.
" వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.. వరదలు వస్తున్నాయ్.. ఇలాంటి సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలిస్తుంటాయి.. కానీ జంతువుల గురించి ఎవరూ అంతగా పట్టించుకోరు. కుక్కలు, ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ల ప్రాణాల గురించి ఎవ్వరూ లెక్క చేయరు. ఇలాంటి సమయంలో పాపం వాటి గురించి కాస్త కాస్త ఆలోచించండి, వాటిని అలా వరదలకు వదిలేయకండి . మీరు బయటకు వెళ్లాల్సి వస్తే వాటిని ఇంట్లోనే కట్టి ఉంచకండి. వాటిని ఫ్రీగా వదిలేయండి. ఈ విషయంలో మీకు ఎలాంటి సలహాలు, సాయం కావాలన్నా రెస్క్యూ టీం మీ అందుబాటులో ఉంటుంది" అని ఓ నంబర్‌ను చూపించింది రష్మీ. ప్లీజ్ సేవ్ యానిమల్స్ అంటూ రిక్వెస్ట్ చేసింది.