Home > సినిమా > సనాతన ధర్మంపై రష్మీ గౌతమ్ పోస్ట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

సనాతన ధర్మంపై రష్మీ గౌతమ్ పోస్ట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

సనాతన ధర్మంపై రష్మీ గౌతమ్ పోస్ట్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
X

టీవీ యాంకర్ , నటి రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేసి పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. నెట్టింట్లో యాక్టివ్‎గా ఉండే రష్మీ తరచుగా పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారిన సనాతన ధర్మం గురించి రష్మీ పెట్టిన ఓ పోస్ట్‌ను నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏకంగా ఓ వ్యక్తి రష్మీని టార్గెట్ చేసి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో, సీరియస్ అయిన రష్మీ అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ డిస్కషన్ పీక్ లెవెల్‎లోకి వెళ్లడంతో అసహనానికి గురైన రష్మీ తనదైన స్టైల్ లో గట్టి కౌంటర్ ఇచ్చింది.

సనాతన ధర్మంపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టించాయి. సనాతన ధర్మం అనేది ఓ రోగం లాంటిదని, డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన కాపెంట్స్‎పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను కాస్త యాంకర్ రష్మీ తన సోషల్ మీడియా అకౌంట్‎లో షేర్ చేసింది. దీంతో రష్మీని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

" నేను ఈ వీడియోను షేర్ చేయగానే నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. భావ వ్యక్తీకరణ అనేది ఒకటి ఉంది కదా? అసలు నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారు. నేను నా విశ్వాసాలను , నా ఇష్టాలపై మాట్లాడుతుంటే మీరెందుకు ఖండిస్తున్నారు. అసలు నేను ఎందుకు సిగ్గు పడాలి? నేను ఎప్పుడైనా మీరు దేవుళ్లను ఎందుకు నమ్మరని అడిగానా? మరి నేను దేవుళ్లను నమ్మితే మీరెందుకు ప్రశ్నిస్తున్నారు. కులవివక్ష గురించి మాట్లాడుతున్నారు. ఏ మతం పర్‌ఫెక్ట్‌గా ఉందో చెప్పండి. మిగితా మతాల్లో ఇలాంటి సమస్యలే లేవా? అక్కడ ఇలాంటి అతివాదులు లేరా? ప్రతీ మతానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి నమ్మకం వారిది, బతుకు వారిది. ప్లీజ్ నా దేవుళ్లని, నా నమ్మకాలను తిట్టకండి" అంటూ యాంకర్ రష్మీ తనను ట్రోల్ చేసేవారికి కౌంటర్ ఇచ్చింది.

Trending news,

Updated : 12 Sept 2023 9:52 AM IST
Tags:    
Next Story
Share it
Top