Home > సినిమా > ఫొటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటావ్..నెటిజన్‌కు షాకిచ్చిన రష్మీ

ఫొటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటావ్..నెటిజన్‌కు షాకిచ్చిన రష్మీ

ఫొటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటావ్..నెటిజన్‌కు షాకిచ్చిన రష్మీ
X

యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు బుల్లితెరపై బిజీ యాంకర్‌గా ఉంటోంది. జబర్దస్త్ షోలో యాంకర్‌గా చేసిన తర్వాత ఆమెకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో ఆ షో సూపర్ హిట్ రేంజ్‌కు వెళ్లింది. ఆ క్రేజ్‌తోనే రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసేందుకు అవకాశం వచ్చింది.

స్టేజ్‌పై కూల్‌గా కామెడీ పంచ్‌లు వేసే రష్మీ ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పేస్తుంది. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె జొమోటో గ్రీన్ డ్రెస్ మీద రియాక్ట్ అయ్యింది. వెజిటేరియన్‌కి గ్రీన్ డ్రెస్ అనే ఆప్షన్ పెడితే తప్పేంటి అంటూ జొమోటో నిర్ణయానికి రష్మీ సపోర్ట్ చేసింది. ఆ పోస్ట్‌పై ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. కేవలం రీచ్ కోసమే ఇదంతా చేశావా అంటూ ప్రశ్నించాడు.

దీనిపై రష్మీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. రీచ్ కోసమైతే తాను అలాంటి విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఒక్క ఫోటో చాలు జూమ్ చేసి మరీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారని అంది. మొత్తానికి నీకైతే ఆ టెన్షన్ దొరికిందని నేను అనుకుంటున్నాను..ఎన్ని రోజుల నుంచి ఈ ఆ టెన్షన్ కోసం ఎదురు చూస్తున్నావో అంటూ ఆ నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Updated : 26 March 2024 12:29 PM IST
Tags:    
Next Story
Share it
Top