Home > సినిమా > Suma Kanakala: కుమారి ఆంటీ డీజే సాంగ్‌కు యాంకర్ సుమ పెర్ఫామన్స్

Suma Kanakala: కుమారి ఆంటీ డీజే సాంగ్‌కు యాంకర్ సుమ పెర్ఫామన్స్

Suma Kanakala: కుమారి ఆంటీ డీజే సాంగ్‌కు యాంకర్ సుమ పెర్ఫామన్స్
X

ఈమధ్య కాలంలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో.. అసలు తెలియడం లేదు. ఏదొక ఒక చిన్న మాటతో లేదా వీడియోతో వైరల్ అయ్యి ట్రేండింగ్ లోకి రావడం, ఆ తరువాత సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. ఇక వీరికి వచ్చిన ఫేమ్‌ని.. సినిమా స్టార్స్ కూడా ఉపయోగించుకోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ‘కుమారి ఆంటీ’ అనే మహిళ తెగ వైరల్ అవుతున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న సదరు కుమారి ఆంటీ.. మీది మొత్తము 1000 అయింది. రెండు లివర్లు ఎక్‌స్ట్రా అనే డైలాగ్ తో పాపులర్ అయింది. ఎంతలా అంటే సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సైతం.. ఆమె చిరు వ్యాపారానికి ట్రాఫిక్ పోలీసులు అడ్డు చెప్పకూడదనే ఆదేశాలు జారీ చేసేంత. స్వయంగా ఒక రాష్ట్ర సీఎం.. కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో చాలా పెద్ద టాపిక్ అయ్యింది.


ఇక కుమారీ ఆంటీ వీడియో ను డీజే మిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. తాజాగా కుమారీ ఆంటీ డీజే సాంగ్ కు ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది. అసలే ట్రెండ్ అయిన వీడియోలను రీ క్రియేట్ చేయడంలో సుమ సిద్దహస్తురాలు. ఇక ఈ డీజే వీడియోను మాత్రం ఎందుకు వదులుతుంది? కుమారి ఆంటీ డైలాగ్స్ తో ఇన్ స్టా రీల్ ను ఇరగదీసింది. మధ్యలో బ్రహ్మాజీ వీడియోలను కూడా వాడేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ సుమక్క.. పర్ఫెక్ట్ సెట్ అయ్యింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.



Updated : 8 Feb 2024 8:57 PM IST
Tags:    
Next Story
Share it
Top