Home > సినిమా > Sohel : డబ్బులు లేవంటే ఈ హీరోకు సాయం చేసిన సుమ

Sohel : డబ్బులు లేవంటే ఈ హీరోకు సాయం చేసిన సుమ

Sohel : డబ్బులు లేవంటే ఈ హీరోకు సాయం చేసిన సుమ
X

చిత్ర పరిశ్రమలోకి అప్పుడప్పుడే వస్తున్న వారికి ఇండస్ట్రీలో కొంత మంది సాయం చేస్తూ ఉంటారు. చిన్న సినిమాలకు కూడా కొంతమంది స్టార్ హీరోలు ఏమీ ఆశించకుండా సహాయం చేస్తుంటారు. ఈవెంట్స్ చేయడంలో, మూవీని ప్రమోట్ చేయడంలో, చిన్న పాత్రలు చేసి కొంత హైప్ తీసుకురావడంలో సాయం చేసే వారు కూడా కొందరు ఉంటారు. తాజాగా అలాంటి సాయాన్నే యాంకర్ సుమ చేశారు. ఈ విషయం గురించి టాలీవుడ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చెప్పుకొచ్చారు.

యాంకర్ సుమ గత ఇరవై ఏళ్లుగా తెెలుగు ప్రేక్షకులను యాంకర్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో ఆమె బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు యాంకర్ సుమ కచ్చితంగా ఉండాల్సిందేనని ప్రతి ప్రొడ్యూసర్, దర్శకుడు, హీరో కోరుకుంటాడు. అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు యాంకర్ సుమ భారీగానే పేమెంట్ తీసుకుంటారు. కానీ ఈమధ్య ఆమె సోహెల్ మూవీ ఈవెంట్‌కు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తానన్నారు.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌తో ఫేమస్ అయిన సొహెల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీతో సొహెల్ మంచి విజయాన్ని పొందాడు. ఆ తర్వాత ఇప్పుడు బూట్‌కట్ బాలరాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఇకపోతే మూవీ ప్రమోషన్ కోసం సోహెల్ సుమ అడ్డా షోకి వెళ్లారు. ఆ షోలో సోహెల్ మాట్లాడుతూ.. తన దగ్గర డబ్బులు లేవని చెబితే యాంకర్ సుమ తన ఈవెంట్‌కు ఫ్రీగా చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఆ సమయంలో ఎమోషనల్ అయిన సోహెల్ యాంకర్ సుమ కాళ్లు మొక్కారు.



Updated : 29 Jan 2024 9:23 AM IST
Tags:    
Next Story
Share it
Top