అనిల్ రావిపుడిని ట్రోల్ చేస్తూ.. షూటింగ్ సెట్లో రచ్చ చేసిన కాజల్, శ్రీలీల
X
డైరెక్టర్ అనిల్ రావిపుడి.. తనదైన కామెడీ పంచులతో వెండితెరపైనే కాదు.. సెట్స్ పైన కూడా పక్కనవారిని నవ్విస్తుంటారు. అనిల్.. కేవలం దర్శకుడిగానే కాదు.. మల్టీటాలెంటెడ్ నని చాలాసార్లు ప్రూవ్ చేశాడు. టైం దొరికిన ప్రతిసారి సెట్స్ లో డాన్స్ తో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా భగవంత్ కేసరి సెట్ లో డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ తో బాలయ్య పాటకు స్టెప్పులేశాడు. అయితే, దాన్ని హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల ట్రోల్ చేశారు. ‘నీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మా వంతు’ అంటూ బాలయ్య పాటకు డాన్స్ చేసి చూపించారు. ఆ రీల్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అనిల్.. ‘నా మీద వీళ్లకు చాలా చెలస్ ఉంది. బాలయ్య పాటలు వింటే డాన్స్ చేయకుండా ఎవరు ఊరుకుంటారు. ఆ పాటల్లో ఉండే ఊపు అలాంటిది’ అంటూ ట్యాగ్ చేశాడు. ‘ఇంకా అయిపోలేదు.. మిగిలిపోయింది చాలా ఉంద’ని కాజల్, శ్రీలీల చెప్తారు. అంటే ఈ సినిమాలో వీళ్లిద్దరి నుంచి ఎక్స్ పెక్ట్ చేయాల్సింది చాలా ఉందని తెలుస్తోంది. అనిల్ రావిపుడీ ఎదో గట్టిగానే ప్లాన్ చేశాడని ఆభిమానులు అనుకుంటున్నారు.