యానిమల్ కలెక్షన్ల ఊచకోత.. 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
X
సందీప్ రెడ్డి వంగ, రణ్బీర్ కపూర్ కాంబీనేషన్ లో వచ్చిన సినిమా యానిమల్.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న యానిమల్.. రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తుంది. ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ జానర్ లో రిలీజైన ఈ సినిమా.. హౌస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. తర్వత రెండు రోజుల్లో ఫస్ట్ డేని మించి రూ.120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా.. నాలుగు, ఐదు రోజుల్లో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఆరో రోజు రూ. 46 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.
దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 527.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ.250 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 600 కోట్లకు పైగా రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న స్పీడ్ ను కొనసాగిస్తే.. ఈ వారం ముగిసేసరికి రూ.1000 కోట్ల మార్క్ ను అందుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలేవీ లేవు. ఇది కూడా ఆ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో యానిమల్ ఏ రేంజ్ లో కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందో చూడాలి.