Home > సినిమా > ఆ హీరోయిన్ బయోపిక్‌లో 'యానిమల్' బ్యూటీ!

ఆ హీరోయిన్ బయోపిక్‌లో 'యానిమల్' బ్యూటీ!

ఆ హీరోయిన్ బయోపిక్‌లో యానిమల్ బ్యూటీ!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత అతికొద్ది సమయంలోనే వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలు చేసి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా విడుదల కావడంతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. ఈ అమ్మడు కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కి వచ్చినా ప్రస్తుతం ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

కన్నడ చిత్రపరిశ్రమలో 'కిరాక్ పార్టీ' అనే సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తెలుగులో హీరో నాగశౌర్య సరసన 'చలో' సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు క్యూకట్టాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటుగా బాలీవుడ్ లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే యానిమల్ మూవీతో బ్లాక్‌బస్టర్ హీట్‌ను అందుకుంది. ఆ మూవీ తర్వాత ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తోంది.

యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ సరసన నటించిన రష్మికకు అటు తమిళంలోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. తాను ఒకప్పటి స్టార్ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు..ఒకప్పుడు తన అందంతో, అభినయంతో కట్టిపడేసిన సౌందర్య కావడం విశేషం. తనకు సౌందర్య అంటే చాలా ఇష్టం అని, అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటిస్తానని చెప్పుకొచ్చింది. రష్మిక మాటలకు నెటిజన్లు సైతం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప2 మూవీలో నటిస్తోంది.

Updated : 28 Jan 2024 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top