Home > సినిమా > Animal OTT : రేపే ఓటీటీలోకి యానిమల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Animal OTT : రేపే ఓటీటీలోకి యానిమల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Animal OTT : రేపే ఓటీటీలోకి యానిమల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. యువ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో దుమ్మురేపిన ఈ సినిమా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న.. నెట్ ఫ్లిక్స్ వేదికపై విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్స్ లో మూవీ రన్ టైం 3 గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటీటీలో అదనంగా ఇంకొన్ని నిమిషాలను జోడిస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. దాదాపు 8 నిమిషా అదనపు నిడివితో యానిమల్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లోకి తీసుకురానున్నారు. యాక్షన్ సినిమా ప్రియులకు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ అందించిన ఈ సినిమా.. సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ రానుంది. ఈ సినిమాపై అప్ డేట్స్ విడుదల కావాల్సి ఉంది.



Updated : 25 Jan 2024 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top