Home > సినిమా > ANIMAL TRAILER: సెంటిమెంట్‌తో కూడిన మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్

ANIMAL TRAILER: సెంటిమెంట్‌తో కూడిన మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్

ANIMAL TRAILER: సెంటిమెంట్‌తో కూడిన మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్
X

అర్జున్ రెడ్డి వంటి సంచలన మూవీ తరువాత సందీప్ వంగా నుంచి వస్తున్న మూవీ ‘యానిమల్’. అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని 3 నిమిషాల ముప్పై రెండు సెకన్ల లాంగ్ నిడివితో రిలీజ్ చేశారు.

సినిమా ట్రైలర్ చూశారంటే.. క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు. అంత ఇంటెన్సిటీతో ఉంది. టీజర్ తో శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ.. ట్రైలర్ తో ఆడియన్స్‌ ని మెస్మరైజ్ చేశాడు. రణబీర్ కపూర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే... ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇది పూర్తిగా సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ అనే విషయం తెలిసిపోతుంది. మేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల యాక్టింగ్.. ఇలా ప్రతీ ఒక్కటి.. ట్రైలర్ లోని ప్రతి ఎలిమెంట్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. హ్యూజ్ గన్ ఫైరింగ్ షాట్ అండ్ ట్రైలర్ ఎండ్ లో బాబీ డియోల్-రణబీర్ కపూర్ ఫైట్ సీక్వెన్స్ లు అయితే చెప్పడం కంటే చూస్తేనే ఆ మజా ఏంటో తెలుస్తది. ఇక ట్రైలర్ లో బీజీఎం అయితే నెక్స్ట్ లెవల్. హీరో రణ్ బీర్ కపూర్ కనిపించిన ప్రతీ ఫ్రేమూ యూత్ ని పిచ్చేక్కించేలా ఉంది. ఇలాంటి ట్రైలర్ కట్ ని సందీప్ రెడ్డి వంగ మాత్రమే చెయ్యగలడు. సింపుల్ గా చెప్పాలి అంటే యానిమల్… ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఉంటే ఒక మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా మొత్తం హిందీ యాక్టర్స్ తోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ తో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా చేయబోయే విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలి అంటే డిసెంబర్ 1 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.



Updated : 23 Nov 2023 2:59 PM IST
Tags:    
Next Story
Share it
Top