Home > సినిమా > Hanuman : హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు : చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి

Hanuman : హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు : చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి

Hanuman  : హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు : చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి
X

సంక్రాంతి పండగ సందర్భంగా హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని పొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ కుర్ర హీరో తేజా సజ్జా ఈ మూవీలో హీరోగా నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా హనుమాన్ మూవీ టీమ్ హైదరాబాద్‌లో హనుమాన్ మూవీ సక్సెస్ కావడంతో కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ విచ్చేశారు.

ఈ సందర్భంగా పూజారి రంగరాజన్ మాట్లాడుతూ..ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన చెందారు. ఇప్పటి వరకూ చాలా మందికి తెలియని ఓ పురాణ అంశాన్ని ఆయన తెలిపారు. ఓ సందర్భంలో ఆంజనేయస్వామి కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సీత జాడ కోసం లంకకు హనుమంతుడు వెళ్తాడని, అక్కడ ఎంత గాలించినా సీత ఆచూకీ దొరకకపోవడంతో హనుమంతుడు బెంగ పెట్టుకున్నట్లు తెలిపారు.

సీతమ్మ కనపడకపోతే రాముడు, అయోధ్య ప్రజలు, వానర సైన్యం పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆంజనేయుడు బాగా ఆలోచించాడు. అందరూ ఆత్మత్యాగం చేసే అవకాశం ఉందని ఆంజనేయుడు అంచనా వేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడని పూజారి రంగరాజన్ వెల్లడించారు. ఆ తర్వాత చాలా రకాలుగా చనిపోవాలనుకున్న ఆంజనేయుడు ఆ తర్వాత కొంతసేపటికి తనకు తానుగా కౌన్సిలింగ్ ఇచ్చుకుని తిరిగి సీతమ్మ కోసం వెతుకుతాడని చెప్పారు. ప్రస్తుతం పూజారి రంగరాజన్ చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Updated : 27 Jan 2024 9:42 PM IST
Tags:    
Next Story
Share it
Top