Home > సినిమా > ఫ్యాన్స్‎కు పండగే..మన్మథుడు మళ్లీ వస్తున్నాడు

ఫ్యాన్స్‎కు పండగే..మన్మథుడు మళ్లీ వస్తున్నాడు

ఫ్యాన్స్‎కు పండగే..మన్మథుడు మళ్లీ వస్తున్నాడు
X

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్‎ల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు మొదలుకొని యంగ్ హీరోల చిత్రాల వరకు గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న చిత్రాలు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమా కూడా రీ రిలీజ్‎కు రెడీ అయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ మూవీ రిలీజ్‎కు సంబంధించిన డేట్‎ను తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. నాగ్ ఫ్యాన్స్‎ను ఖుష్ చేసింది.





నాగార్జున హీరోగా , సోనాలి బింద్రే , అన్షు లు హీరోయిన్లుగా నటించిన మన్మథుడు సినిమా 2002లో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో కె విజయ భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వచ్చినా కన్నార్పకుండా చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ్ కెరియర్‎లోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ఇది. అందుకే ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని తన పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‎కు ఇది బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. నాగార్జున బర్త్ డేకి ఫ్యాన్స్‎తో పాటు సినీ ప్రియులకు కూడా సర్ప్రైజ్ ఇస్తున్నారు కింగ్.

ఈ వివరాలు వెల్లడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఈ ప్రకటనతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Updated : 16 Aug 2023 9:16 PM IST
Tags:    
Next Story
Share it
Top