Home > సినిమా > Tollywood Pan India Movies : టాలీవుడ్లో మరో బిగ్ ఫైట్..ఆ మూడు వచ్చేది అప్పుడే?

Tollywood Pan India Movies : టాలీవుడ్లో మరో బిగ్ ఫైట్..ఆ మూడు వచ్చేది అప్పుడే?

Tollywood Pan India Movies   : టాలీవుడ్లో మరో బిగ్ ఫైట్..ఆ మూడు వచ్చేది అప్పుడే?
X

(Tollywood Pan India Movies) బాక్సాఫీస్ ఎదుట టాలీవుడ్..మరో బిగ్ ఫైట్ కు సిద్దమవుతోంది. టాప్ స్టార్స్ కి సంబంధించిన మూడు పాన్ ఇండియా(pan India) మూవీలు ఒకేసారి ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమవుతున్నాయి. అందులో రామ్ చరణ్(Ram charan), ఎన్టీఆర్(Ntr), మంచు విష్ణు(Manchu Vishnu) సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ లో ఇటీవలే బిగ్గెస్ట్ సంక్రాంతి వార్ ముగిసింది. ఈ పోంగల్ కి సినీయర్ హీరోలు, జూనియర్ హీరోలు పోటీ పడి తమ విజయాలను పరీక్షించుకున్నారు. ఆ సందడి నుండి ఆడియన్స్ ఇంకా బయటకు రాకముందే.. మరో బిగ్గెస్ట్ వార్ కు రంగం సిద్దం చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్యే ట్రిపుల్ ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్(Ram charan). తాను హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతికి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార కారాణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి దసరా బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న దేవర మరో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. టాలీవుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో ఫ్యాన్స్ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఈ సినిమాను కూడా ముందు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, మూవీ షూట్ లో హిరో సైఫ్ ఆలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో వాయిదా పడింది. అలా ఈ సినిమా కూడా దసరా బరిలో నిలువనుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇక మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు(Manchu Vishnu) హీరోగా వస్తున్న కన్నప్ప దసరాకు రానున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం సెలబ్రెటీలు, హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం వర్క్ అందిస్తున్నారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో ఈ మూవీ పై మరికొంత హైప్ నెలకొంది. భారీ జీఎఫ్ఎక్స్ తో రానున్న ఈ సినిమాను కూడా దసరా కానుకగా తెవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట.

మరి ఇదే నిజమైతే..టాలీవుడ్(tollywood)లో మరో భారీ బాక్సాఫీస్ వార్ జరగడం పక్కాగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీస్ కు సంబంధించి రిలీజ్ డేట్స్ పై ఇప్పటివరకు క్లారీటి రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఫీస్(boxoffice) ఎదుట ఎంతమేర కాసుల వర్షం కురిపిస్తుందో చూడాలి.







Updated : 3 Feb 2024 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top