Home > సినిమా > మోక్షజ్ఞ కంటే ముందు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో

మోక్షజ్ఞ కంటే ముందు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో

మోక్షజ్ఞ కంటే ముందు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో
X

టాలీవుడ్‌లోకి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉన్నారు. వారి తర్వాత బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ మోక్షజ్ఞ సినిమాపై ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.

బాలయ్య కూడా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందుగా మరొకరు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రేజీ న్యూస్ విని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు..నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ పెద్ద కుమారుడు తారకరామారావు. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కంటే పెద్దవాడైన జానకిరామ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

జానకిరామ్ కొడుకు తారకరామారావు ఆ మధ్య కల్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే మూవీలో, బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు తారకరామారావు హీరోగా సీనియర్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఓ స్టోరీని సిద్దం చేశాడట. ఓ పవర్ ఫుల్ లవ్ స్టోరీ ద్వారా తారకరామారావును ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారట. ఆ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్టార్ట్ అయ్యాయట. దీంతో మోక్షజ్ఞ కంటే ముందుగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.


Updated : 26 March 2024 11:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top