‘ప్రాజెక్ట్ కె’ లో మరో స్టార్ హీరో..
X
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’.ఈ ఫాంటసీ సైంటిఫిక్ మూవీ గురించి తెలుగు సినీ పరిశ్రమతో పాటు భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ ప్రముఖ నటీనటులు భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ కే నుంచి కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి.
ప్రాజెక్ట్ కే లో మరో ప్రముఖ హీరో నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ పాత్రలో పేరుగాంచిన నటుడు కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడి పాత్ర కథను మలుపు తిప్పుతుందని సమాచారం. అయితే ఆ నటుడు ఎవరన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా 90% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కేవలం ఇంకా 10 శాతం మిగిలి ఉంది.
‘ప్రాజెక్ట్ కె’ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ నెల 20న అమెరికాలో జరిగే కామికాన్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.