Home > సినిమా > Director krish : డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన క్రిష్

Director krish : డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన క్రిష్

Director krish : డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన క్రిష్
X

రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో గచ్చిబౌలీ పోలీసులు ఏ10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. పోలీసు విచారణకు రావాలంటూ ఇప్పటికే ఆయనకు నోటీసులు పంపారు. అయితే తాను ముంబైలో ఉండటం వల్ల రాలేకపోతున్నట్లు క్రిష్ తెలిపారు. అలాగే ఈ కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తుగా ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నేడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్‌లు కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అలాగే యూట్యూబర్ లిషి, శ్వేత, నీల్, ఇంకొంతమంది కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏ11గా గజ్జన వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ పేరును, ఏ12గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీర్ పేరును చేర్చారు. ఏడాది కాలంగా వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.

సైంధవ్ మూవీ నిర్మాత వెంకట్ కుమారుడు నీల్‌ను ఏ9 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం నీల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరుగురు అరెస్ట్ అయ్యారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్‌లు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Updated : 1 March 2024 11:08 AM IST
Tags:    
Next Story
Share it
Top