Home > సినిమా > Anushka : అనుష్క సినిమాకు చేప పేరు?...వార్త వైరల్

Anushka : అనుష్క సినిమాకు చేప పేరు?...వార్త వైరల్

Anushka : అనుష్క సినిమాకు చేప పేరు?...వార్త వైరల్
X

తెలుగు ఇండస్ట్రీలో లేడి ఓరియెంటడ్ మూవీస్ లో అనుష్కకు ఉన్న క్రేజ్ వేరు. హీరోల సినిమాలతో సమానంగా లేడి ఓరియెంటడ్ మూవీతో ప్రేక్షకులను థియెటర్స్ కు రప్పించడంలో స్వీటీ దిట్ట. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది అనుష్క. గతంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తర్వాత ఆడియెన్స్ ను పలకరించారు. ఆ తర్వాత తన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఎట్టకేలకు తెలుగులో ఓ చిత్రానికి స్వీటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. కథను ఓకే చేయడమేకాక, గప్‌చిప్‌గా షూటింగ్‌ కూడా కానిచ్చేస్తున్నట్లు సమాచారం.





తెలుగు ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటడ్ చిత్రాలంటే తొలుత వినిపించే పేరు విజయశాంతి. ఆ తర్వాతి కాలంలో ఆమె ప్లేస్‌ను రిప్లేస్ చేసింది అనుష్క. అరుంధతిలో అనుష్క నటనకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. దీంతో స్వీటీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ త‌ర్వాత పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి, సైజ్ జీరో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది బొమ్మాళి. అయితే ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఆమె మళ్లీ ఓ సినిమా చేస్తుంది. ఇంతకుముందు క్రిష్ దర్వకత్వంలో వేదం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏండ్ల తర్వాత వీరిద్దరి నుంచి ఓ మూవీ రాబోతుడడంతో ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు.




అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. స్వీటి కొత్త మూవీకి శీలావతి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ‘శీలావతి’ అంటే ఓ రకం చేప పేరు. మరి ఈ సినిమాకు దానికి సంబంధం ఎంటో తెలియాల్సి ఉంది. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’లో సరోజ అనే వేశ్య పాత్రలో అనుష్క నటించింది. సరోజ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అయితే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు టాక్‌. రానున్న ఈ ‘శీలావతి’ కూడా అనుష్క కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం అంటున్నారు.




Updated : 18 Feb 2024 11:48 AM IST
Tags:    
Next Story
Share it
Top